బహుముఖం మూవీ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ విడుదల

బహుముఖం మూవీ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ విడుదల

హర్షివ్ కార్తీక్ హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బహుముఖం’. గుడ్, బ్యాడ్ అండ్ యాక్టర్ అనేది ట్యాగ్‌‌లైన్‌‌. ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో హీరో హర్షివ్ కార్తీక్ ముఖం.. ఓ వైపు శివుడి తరహాలో సుదుటిపై విభూతి, నీలం రంగులో కనిపిస్తుండగా, మరోవైపు స్టైలిష్‌‌ లుక్‌‌లో ఉన్నాడు. కన్నీళ్లు ఓ వైపు, ఆనందం మరోవైపు కనిపిస్తున్నాయి. రెండు చేతులకు సంకెళ్లు వేశారు.

మొత్తానికి ఇదొక విలక్షణమైన సినిమా అని పోస్టర్‌‌‌‌తో తెలియజేశారు. అట్లాంటా, మాకాన్, కాంటన్, జార్జియా, యుఎస్ఏ పరిసర ప్రాంతాలలో ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ షూటింగ్ చేశారు. స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రాఫర్ కాగా, ఫణి కళ్యాణ్ సంగీతం, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. త్వరలో విడుదల కానుంది.