ఢిల్లీ లిక్కర్‌‌‌‌‌‌‌‌ స్కాం : బినోయ్ బాబుకు బెయిల్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్‌‌‌‌‌‌‌‌ స్కాం : బినోయ్ బాబుకు బెయిల్ పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడైన హైదరాబాద్‌‌‌‌కు చెందిన లిక్కర్ వ్యాపారి బినోయ్ బాబు మధ్యంతర బెయిల్‌‌‌‌ను ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. సైనస్ సమస్యతో బాధపడుతున్న తన కూతురు శస్త్ర చికిత్స కోసం బినోయ్ బాబుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 26 నుంచి రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే, మరో 3 వారాలు తన బెయిల్‌‌‌‌ను పొడిగించాలని సీబీఐ స్పెషల్ కోర్టును ఆయన ఆశ్రయించగా, స్పెషల్ జడ్జి నాగ్‌‌‌‌పాల్ ఆ పిటిషన్‌‌‌‌ను తిరస్కరించారు. దీంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని విచారించిన కోర్టు 10 రోజుల పాటు బెయిల్‌‌‌‌ను పొడిగించింది. కుమార్తెల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో బెయిల్‌‌‌‌ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.