Balagam Venu: నానితో బలగం వేణు సినిమా..మరోసారి అలాంటి కథే

Balagam Venu: నానితో బలగం వేణు సినిమా..మరోసారి అలాంటి కథే

బలగం (Balagam) సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు జబర్దస్త్ వేణు(Jabardasth Venu). ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణు (Balagam Venu)గా మారిపోయాడు.

వేణు తన తరువాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నాని (Nani)ని సెలెక్ట్ చేసుకున్నాడట. ఈ కాంబోని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెట్ చేశారట. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథ చర్చలు పూర్తవగా..ఫైనల్ నేరేషన్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. 

వేణు తన కెరీర్ ఫస్ట్ ఫిల్మ్ తోనే సినీ ఇండస్ట్రీతో పాటు..ఇండియా వైడ్గా ఉన్న తెలువారందరినీ తనవైపు తిప్పుకున్నాడు. అలాంటి బలగం వేణు..ప్రేక్షకులకు తన సహజ నటనతో దగ్గరైన నానితో..ఎలాంటి కథతో వస్తున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇప్పుడు ఈ న్యాచురల్ కాంబో నుంచి ఆసక్తికర లీక్ బయటికి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమా తెలంగాణ పల్లెటూరిలో జరిగే ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

నాని కెరీర్లో ఇదివరకే శ్యామ్ సింగరాయ్తో పీరియాడిక్ కాన్సెప్ట్ టచ్ చేశాడు. ఇప్పుడు మళ్లీ నానితో కొత్తగా తెలంగాణ లవ్ స్టోరీతో..బలగం వేణు తనదైన పాత కాలానికి..ప్రేమలు హత్తుకునే సామ్రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ కాంబోపై ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. త్వరలో ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ఇటీవలే నాని హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం మూవీలో నటిస్తున్నాడు.