Balagam Venu: బలగం వేణులో మరో టాలెంట్..అందులో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్

Balagam Venu: బలగం వేణులో మరో టాలెంట్..అందులో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్

బలగం (Balagam) సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు జబర్దస్త్ వేణు (Jabardasth Venu). ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణు(Balagam Venu)గా మారిపోయాడు.

వేణు తనలోని టాలెంట్ని..నాటకాలతోను, జబర్దస్త్ షోస్ లోను,కమెడీయన్ గాను నిరూపించుకుంటూ వచ్చారు. ఇక బలగం సినిమాను డైరెక్ట్ చేసి..తెలంగాణ మట్టి వాసనను తట్టిలేపే డైరెక్టర్ వచ్చాడంటూ గుర్తింపు పొందారు.

వేణు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనలో మరో టాలెంట్ కూడా ఉందని తెలిపారు.తాను సినిమాల్లోకి రాకముందు ఏం చేసాడో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వేణు తల్లితండ్రులు కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళని, అలా తాను కూడా చిన్నప్పట్నుంచి ఆ కూరగాయలను అమ్మానని తెలిపాడు. అంతేకాకుండా మనలో కాస్తా విభిన్నమైన టాలెంట్ ఇంకో ఏదో ఉండాలని అలోచించి..మార్సల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నాడని చెప్పాడు. మార్షల్ ఆర్ట్స్ లో పాల్గొని స్టేట్ ఛాంపియన్ గా రెండు సార్లు కూడా విన్ అయ్యానంటూ ఆసక్తికర విషయాన్నీ పంచుకున్నాడు. 

వేణు బలగం సినిమా..తెలంగాణ నాడిని..పల్లెటూరి ప్రేమలని..ప్రతి ఇంట్లో బంధాలని..చాలా సహజంగా అందరికీ నచ్చేలా చూపి..కళ్ళు తెరిపించింది. దీంతో చాలా మంది 'మీరే నా బలం..మీరుంటేనే నా బలగం' అనుకునేలా ఈ సినిమా చేసింది. ప్రస్తుతం బలగం వేణు..దిల్ రాజు బ్యానర్లో న్యాచురల్ స్టార్ నానితో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.