సూటు..బూటు.. బాలయ్య గెటప్ అదిరిందయ్య..!

సూటు..బూటు.. బాలయ్య గెటప్ అదిరిందయ్య..!

నటసింహ బాలకృష్ణ ఫ్యాన్స్ కు సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తన 105 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మంగళవారం రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో బాలయ్య సూట్‌ లో ఫ్రెంచ్ గడ్డంతో హ్యాండ్సమ్‌ గా కనిపించాడు. ఈ లుక్‌ కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్య బరువు తగ్గినట్లు ఫస్ట్‌ లుక్‌ ను బట్టి తెలుస్తోంది. బాలకృష్ణ సరసన సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను .. హ్యాపీ మూవీస్‌ బ్యానర్ పై సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే బాలయ్య పౌరాణిక, డాన్, పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్, మాస్ సినిమాలు చేసి అదరగొట్టాడు. ఈ ఏడాది విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా NTR కథానాయకుడు‌, NTR మహానాయకుడు సినిమాలతో బాలయ్య ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి కొత్త గెటప్ తో కనిపించడంతో.. ఫ్యాన్స్ లో ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మూవీ టైటిల్..మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.