నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తనయుడిగా మోక్షజ్ఞ త్వరోనే తెరపైకి వస్తున్నాడే చర్చ ఇప్పుడు మరోసారి నెట్టింట్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలుమార్లు ఆయన డెబ్యూపై వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ విషయంలో కీలకమైన అడుగులు పడుతున్నట్లు సమాచారం.
మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు, ఈ సినిమాకు 'బింబిసారతో తన సత్తా చాటిన వశిష్ఠ దర్శకత్వం వహించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ పనులు పూర్తయిన తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయిలో వశిష్ఠ దృష్టి పెట్టనున్నారని సమాచారం.
మోక్షజ్ఞ తొలి సినిమాకు కథ, జానర్, క్యారెక్టర్ డిజైన్ వంటి అంశాలపై దర్శకుడు, నిర్మాతలు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఈ సినిమాను భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మోక్షజ్ఞను ఎలా ప్రెజెంట్ చేయాలనే అంశంపై మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, గతంలో 'హనుమాన్’' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. సుధాకర్ చెరుకూరి నిర్మించాల్సిన ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాలతో ముందుకు సాగక చివరకు నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు వశిష్ఠ–మైత్రీ కాంబినేషన్లో మోక్షజ్ఞ డెబ్యూ అనే వార్త నందమూరి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం లీడ్ కాస్ట్, టెక్నికల్ టీమ్ తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దసరా సమయంలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ఆ తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకుని, మోక్షజ్ఞను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మోక్షజ్ఞ సినిమా ఆయన కెరీర్‌కు మాత్రమే కాకుండా నందమూరి అభిమానులకు కూడా ఎంతో కీలకం. బాలకృష్ణ వారసుడిగా వస్తున్న మోక్షజ్ఞకు తొలి సినిమాతోనే భారీ ఇమేజ్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దర్శకుడిగా వశిష్ఠ, నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ పేర్లు తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. అధికారిక ప్రకటన వెలువడితే.. మోక్షజ్ఞ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది...
