మంత్రి వివేక్, ఎంపీ వంశీ కార్లపై బాల్క సుమన్ ఎలా దాడి చేస్తున్నాడో చూడండీ..!

మంత్రి వివేక్, ఎంపీ వంశీ కార్లపై బాల్క సుమన్ ఎలా దాడి చేస్తున్నాడో చూడండీ..!

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. ఎన్నికలో భాగంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి క్యాతనపల్లి వస్తున్న కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీ కాన్వాయ్ పై బీఆర్ఎస్ పార్టీ అనుచరులు రాళ్లతో దాడి చేశారు. రోడ్డుపై పోలీస్ బారికేడ్లు అడ్డంపెట్టి మరీ విధ్వంసానికి తెగబడ్డారు బీఆర్ఎస్ పార్టీ వాళ్లు. 

మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణపై దాడిలో.. బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ స్వయంగా పాల్గొన్నారు. బాల్క సుమన్ రెచ్చగొట్టటమే కాదు.. బాల్క సుమనే స్వయంగా పోలీస్ బారికేడ్ ను మంత్రి, ఎంపీ కాన్వాయ్ పైకి విసిరేశాడు. పోలీసులు అడ్డుకుంటున్నా.. పోలీసులు వారిస్తున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా మంత్రి, ఎంపీ కార్లపై పోలీస్ బారికేడ్ లను విసిరేశాడు. 

మంత్రి, ఎంపీ కాన్వాయ్ పై రాళ్ల దాడిలో బాల్క సుమన్ స్వయంగా పాల్గొన్నటమే కాకుండా.. దగ్గరుండి మరీ రౌడీయిజం, గూండాగిరి చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాతనపల్లికి వస్తున్న మంత్రి, ఎంపీ కాన్వాయ్ పై దాడిలో కీలకమైన వ్యక్తి.. సూత్రదారి, పాత్రదారి అంతా బాల్క సుమన్ అని స్పష్టంగా విజువల్స్, ఫొటోలు చెబుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పటంతో.. పోలీసులు లాఠీచార్జి చేశారు.