25న అలయ్ బలయ్​కి రండి.. గవర్నర్​కు బండారు విజయలక్ష్మి ఆహ్వానం

 25న అలయ్ బలయ్​కి రండి.. గవర్నర్​కు బండారు విజయలక్ష్మి ఆహ్వానం
  • 25న అలయ్ బలయ్​కి రండి
  • గవర్నర్​కు బండారువిజయలక్ష్మి ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు : దసరా సందర్భంగా ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కి అటెండ్ కావాలని గవర్నర్ తమిళిసైని అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. మంగళవారం రాజ్ భవన్ లో తమిళిసైని హర్యానా గవర్నర్ దత్తాత్రేయతో ఆయన కుమార్తె విజయలక్ష్మి కలిశారు. అలయ్ బలయ్ కు సంబంధించిన ఇన్విటేషన్ అందజేశారు. ఈ నెల 25న అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు తమిళిసైకి విజయలక్ష్మి తెలిపారు.