‘టీఆర్ఎస్-ఎంఐఎం మధ్య అక్రమ సంబంధం‘

‘టీఆర్ఎస్-ఎంఐఎం మధ్య అక్రమ సంబంధం‘

జీహెచ్ఎంసీ  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎంఐఎం సపోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. TRS- ఎంఐఎం మధ్య అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని చెప్పారు. GHMC ఎన్నికల్లో బీజేపీ చెప్పిన విషయం నిజమైందని తెలిపారు. TRS-MIM చీకట్లో ప్రేమించుకుంటూ బయటకు వేర్వేరు అని చెప్పాయని.. రెండు కలిసి పోటీ చేయకపోతే TRSకు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదన్నారు సంజయ్. టీఆర్ఎస్ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంకు చెంచా అని విమర్శించారు. GHMCలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమన్నారు. సిగ్గులేకుండా ఎన్నికల్లో మేము వేర్వేరని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని.. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు బండి సంజయ్. పైసా అవినీతికి పాల్పడినా, ఇంచు జాగా వదిలేసినా రెండు పార్టీలను బజారుకు లాగుతామన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ నీచ రాజకీయాలను గమనిస్తున్నారని.. టైం వచ్చిన ప్రతీసారీ కర్రు కాల్చి వాత పెడుతున్నారని విమర్శించారు బండి సంజయ్.

see more news

మిస్ ఇండియాగా తెలంగాణ యువతి

దిశ కేసులో కొత్త ట్విస్ట్.. లారీ ఓనర్ పై అనుమానాలు

సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగిన చిట్యాల సీఐ