సిట్పై నాకు నమ్మకం లేదు.. వివరాలు ఇవ్వను : బండి సంజయ్

సిట్పై నాకు నమ్మకం లేదు.. వివరాలు ఇవ్వను : బండి సంజయ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. సిట్ను తాను విశ్వసించడం లేదని..సిట్పై తనకు నమ్మకం లేదన్నారు. తన దగ్గరున్న సమాచారాన్ని సిట్కు ఇవ్వదల్చుకోలేదని స్పష్టం చేశారు. నమ్మకం ఉన్న దర్యాప్తు సంస్థలకే తన దగ్గరున్న వివరాలను అందిస్తానని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. 

సిట్ నోటీసులు తనకు అందలేదని బండి సంజయ్ తెలిపారు. మీడియాలో వచ్చిన సమాచారం మేరకే తాను సిట్ నోటీసులపై స్పందిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 24న హాజరు కావాలని కోరినట్లు మీడియా ద్వారానే తెలిసిందని..అయితే పార్లమెంట్ సభ్యునిగా తాను సభకు హాజరు కావాల్సి ఉందన్నారు. తాను ఖచ్చితంగా హాజరు కావాలని భావిస్తే..మరో తేదీ చెప్పాలని లేఖలో కోరారు.