సీఎం కేసీఆర్‌ కు బండి సంజయ్‌ లేఖ

సీఎం కేసీఆర్‌ కు బండి సంజయ్‌ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.  కేంద్ర జల్ శక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ కు.. కేసీఆర్ రాసిన లేఖ అభ్యంతరకరంగా ఉందన్నారు. దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. లేఖ పూర్తి అసత్యాలతో ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు.. కేంద్రాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు బండి. పోతిరెడ్డిపాడు సమస్యపై సరైన సమయంలో స్పందించకుండా.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. లేఖలో తాను రాసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి.. వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు బండి.