ప్ర‌ధాని మోడీకి సంజయ్ కృతజ్ఞతలు

ప్ర‌ధాని మోడీకి సంజయ్ కృతజ్ఞతలు

గౌరవ ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీకి శతసహస్ర నమస్సులు అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్. శ‌నివారం బండి సంజ‌య్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపినందుకు కృతజ్ఞతలు అన్నారు సంజ‌య్. ఒక మార్గదర్శి, యుగకర్త, భావిభారత ద్రష్ట అయిన మీ నాయకత్వంలో పనిచేయడం,మీ మార్గదర్శనంలో నడవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

మీ నాయకత్వంలో భారత్ అతిత్వరలోనే విశ్వగురువుగా పునర్వైభవం సాధించడమే కాదు.. ప్రపంచానికంతా మీరు రోల్ మాడల్ గా నిలువబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భావిస్తున్నాను. ఎల్లప్పుడు మీ ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు బండి సంజ‌య్.