Bandla Ganesh Daughter: నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

Bandla Ganesh Daughter: నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఇవాళ (ఆగస్టు 16, 2026న) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రాజకీయ ప్రముఖుల హాజరు.. 

జనని-సూర్యతేజ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంతులు రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబుతో పాటుగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

సందడి చేసిన సినీ తారలు.. 

టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నాగచైతన్య దంపతులు తదితర నటులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, కొరటాల శివ, నటులు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, శ్రీకాంత్, సునీల్ తదితర సినీ ప్రముఖులు కూడా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా ఫొటోలు..

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నూతన వధూవరులకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.