షకీబ్ హాఫ్ సెంచరీ : నిలకడగా ఆడుతున్న బంగ్లా

షకీబ్ హాఫ్ సెంచరీ : నిలకడగా ఆడుతున్న బంగ్లా

పాకిస్థాన్ నిర్దేశించిన 316 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ధీటుగా బదులిస్తోంది. 78 రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ క్రీజులో పాతుకుపోయిన షకీబల్ హసన్ సమయోచితంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. లిటన్ దాస్‌తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలో షకీబల్ హసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే, ఆ తర్వాత కాసేపటికే లిటన్ దాస్ (32) పెవిలియన్ చేరాడు. షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో హారిస్ సోహైల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది. షకీబల్ హసన్ 61, మహ్మదుల్లా 8 పరుగుతో క్రీజులో ఉన్నారు.