బంగ్లాదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తికి 11ఏళ్ళు జైలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తికి 11ఏళ్ళు జైలు

బంగ్లాదేశ్ 21వ మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి 11ఏళ్ళు జైలు శిక్ష ప‌డింది. అవినీతి ఆరోపణలపై బంగ్లాదేశ్ తొలి ప్రధాన న్యాయమూర్తికి ఈ శిక్ష విధించింది ఆ దేశ న్యాయస్థానం. మనీలాండరింగ్, నమ్మక ద్రోహం కేసులో బంగ్లాదేశ్ కోర్టు మైనారిటీ హిందూ సమాజానికి చెందిన దేశంలోని మొదటి ప్రధాన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ సిన్హాకు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న సరేంద్ర కుమార్ సిన్హాకు మనీలాండరింగ్ కేసులో ఏడేళ్లు, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.

బంగ్లాదేశ్ పద్మా బ్యాంకు నుంచి తీసుకున్న 4 కోట్ల టాకాలు (4,70,000 యూఎస్ డాలర్లు) అప్పుగా తీసుకుని మనీలాండరింగ్ పాల్పడ్డాడని రుజువైంది. సిన్హా జనవరి 2015 నుండి నవంబర్ 2017 వరకు బంగ్లాదేశ్ 21వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మైనారిటీ హిందూ సమాజానికి చెందిన బంగ్లాదేశ్ మొదటి ప్రధాన న్యాయమూర్తిగా రికార్డ్ నమోదు చేశారు.