బంజారాహిల్స్లో కారు బీభత్సం..ముగ్గురు యువకుల పరిస్థితి విషమం

బంజారాహిల్స్లో కారు బీభత్సం..ముగ్గురు యువకుల పరిస్థితి విషమం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో డిఫెండర్ కారు బీభత్సం సృష్టించింది.  అతివేగంగా కారును నడిపిన డ్రైవర్..బైక్ ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. 

జూన్ 14వ తేదీ బుధవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ లోని స్టడీ సర్కిల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు కిందపడిపోయారు. వారు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి  తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు.