ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీసీ పొలిటికల్ జేఏసీ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను భర్తరప్ చేయాలని కోరారు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుచేసేలా డీజీపీకి అదేశాలివ్వాలని అన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి రాజ్యాంగ పదవిని అగౌరవ పరిచాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.