ఓట్స్ తో అందం.. ఆరోగ్యం

ఓట్స్ తో అందం.. ఆరోగ్యం

ఓట్స్​తో తయారు చేసిన​ ప్యాక్​​​, స్క్రబ్​​ ముఖానికి  వేసుకుంటే మొటిమలు, మచ్చలు పోతాయి. ట్యాన్​, డార్క్​ సర్కిల్స్​ మాయం అవుతాయి. ఇవే కాదు ఇంకా బోలెడు లాభాలున్నాయి. అవేంటంటే.. 
 ఒకకప్పు ఓట్స్​ని పొడి చేసి బకెట్ వేడినీళ్లలో  కలపాలి.  వాటిల్లో ఒక టీ స్పూన్​ రోజ్​ వాటర్​ కూడా వేయాలి. ఇరవై నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి.  ఇలా వారానికి రెండుసార్లు చేస్తే  ఓట్స్​లోని  మాయిశ్చరైజింగ్, క్లెన్సింగ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ ప్రాపర్టీలు దుమ్ము, ధూళి వల్ల డ్యామేజ్​ అయిన స్కిన్​ని రిపేర్​ చేస్తాయి . 
ఒక టేబుల్ స్పూన్​ పెరుగులో, ఒక టేబుల్ స్పూన్​ ఓట్స్​ పొడి, కొద్దిగా తేనె కలిపి ముఖానికి మసాజ్​ చేయాలి.  ఇలా వారానికి రెండు సార్లు చేస్తే  చర్మంపై బ్లాక్​హెడ్స్​ పూర్తిగా పోతాయి. చర్మం మెరుస్తుంది కూడా. 

ఎగ్​ వైట్​లో రెండు టీ స్పూన్​ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్​ ఓట్స్​ పొడి వేసి పేస్ట్​లా చేసి ముఖానికి ప్యాక్​లా వేసుకున్నా రిజల్ట్​ బాగుంటుంది.  అలాగే  ఒక టేబుల్ స్పూన్​  ఓట్స్​ పొడిలో కొద్దిగా టొమాటో జ్యూస్​ , రెండు టేబుల్ స్పూన్ల రోజ్​ వాటర్​ కలిపి పేస్ట్​ 
చేసి ప్యాక్​ వేసుకుంటే చర్మం ఫ్రెష్​గా ఉంటుంది.