హక్కుల సాధనకు భిక్షాటన

హక్కుల సాధనకు భిక్షాటన

బషీర్ బాగ్, వెలుగు: హక్కుల సాధన కోసం రిటైర్డ్​తపాలా శాఖ ఉద్యోగులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. నాలుగు రోజులుగా డాక్ సదన్, జీపీఓ వద్ద ఆందోళన చేస్తున్నవారు శనివారం అబిడ్స్ జీపీఓ కూడలి వద్ద భిక్షాటన చేపట్టారు. క్యాట్ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని కోరారు. అవకతవకలను సరిదిద్ది బెనిఫిట్స్ అందజేయాలని కోరారు.