భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), బెంగళూరు కాంప్లెక్స్ షార్ట్‌టర్మ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్(2026–-27) కింద ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు (సదరన్ రీజియన్ రాష్ట్రాలు) అభ్యర్థులు మాత్రమే అర్హులు.
పోస్టు పేరు: ఐటీఐ అప్రెంటిస్.
విభాగాలు: ఎలక్ట్రానిక్ మెకానిక్, ఈపీ, డీఎంఎం, ఫిట్టర్, సీఓపీఏ, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్.
విద్యార్హత: ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 2022, జనవరి 01 లేదా ఆ తర్వాత ఐటీఐ పాసైన వారు మాత్రమే అర్హులు. ఫైనల్ ఇయర్/ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు అర్హులు కాదు.
వయసు: 2025, సెప్టెంబర్ 01 నాటికి గరిష్ట వయసు 21 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
స్టైపెండ్ (నెలసరి వేతనం): ఫిట్టర్, డీఎంఎం, ఎలక్ట్రిషియన్, టర్నర్, ఈపీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లకు నెలకు రూ. 11,040, సీఓపీఏ, వెల్డర్ ట్రేడ్‌లకు నెలకు రూ. 10,040 చెల్లిస్తారు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్-ఇన్ సెలెక్షన్ షెడ్యూల్
సెప్టెంబర్ 25: ఎలక్ట్రానిక్ మెకానిక్, ఈపీ ట్రేడ్‌లకు.
సెప్టెంబర్ 26: డీఎంఎం, ఫిట్టర్, సీఓపీఏ, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లకు.
వేదిక: సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్, జలహళ్లి పోస్ట్, బెంగళూరు - 560013.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bel-india.inను సందర్శించండి.
