Bss10 ప్రజాహితముకై..హైదరాబాద్ నగర డీఎస్పీగా బెల్లంకొండ

Bss10 ప్రజాహితముకై..హైదరాబాద్ నగర డీఎస్పీగా బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర(Saagarkchandra) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌‌కి ఇది పదో సినిమా.అందుకే BSS10 వర్కింగ్ టైటిల్‌తో సినిమా అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ స్పెషల్గా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ నగర డీఎస్పీగా పవర్ ఫుల్ లుక్లో కనిపించనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్.. Bss10 పేరిట సర్క్యూలర్ ఆర్డర్ కాపీని జారీ చేస్తూ..సినిమా ఫ్యాన్స్కి ఆసక్తి కలిగించారు. ఓ యంగ్ డైనమిక్ ఆఫీసర్కు హైదరాబాద్ నగర డీఎస్పీగా పోస్టింగ్ వచ్చినట్లు.. త్వరలోనే ఆయన ఛార్జ్ తీసుకోనున్నట్లు తెలిపారు.

ఈ ఆర్డర్ కాపీని ఫ్యాన్స్తో పాటు మీడియాకు ప్రజాహితముకై జారీ చేయడమైనది అని ట్వీట్ చేశారు. దీంతో బెల్లంకొండ 10వ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా లాఠీ పట్టనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అలాగే జనవరి 3న శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అప్‌‌డేట్లో తెలిపారు. 

ఈ మూవీకి టైసన్ నాయుడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ సినిమాకు ధమాఖా,బలగం సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో స్వరాలూ అందిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీశ్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.