టెర్రిఫిక్ వీడియో: ఫ్లాట్ కి మంటలు.. మూడో ఫ్లోర్ నుంచి దూకిన ఇద్దరు చిన్నారులు

టెర్రిఫిక్ వీడియో: ఫ్లాట్ కి మంటలు.. మూడో ఫ్లోర్ నుంచి దూకిన ఇద్దరు చిన్నారులు

అపార్ట్‌మెంట్ లోని తమ ఫ్లాట్ కు మంటలంటుకోవడంతో.. మూడంతస్తుల నుంచి కిందికి దూకారు ఇద్దరు సోదరులు. ఆ సోదరులిద్దరి వయసు 10 ఏళ్ల లోపే కావడం గమనార్హం. ఈ ఘటన ఫ్రాన్స్ లో జరిగింది. స్థానిక మీడియా ప్రకారం.. గ్రెనోబుల్ పట్టణానికి చెందిన దంపతులు తమ పిల్లలిద్దరినీ ఇంట్లో ఉంచి.. బయట నుంచి తాళం వేసుకొని బయటకెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆ పిల్లలున్న ఫ్లాట్ కు మంటలంటుకున్నాయి. బయటకు వద్దామంటే తాళం వేసి ఉంది. ఏం చేయాలో తెలియని ఆ సమయంలో.. పెద్దవాడైన 10 ఏళ్ల బాలుడు.. తన 3 ఏళ్ల తమ్ముడిని తీసుకొని కిటికీలోకి ఎక్కాడు. ఫ్లాట్ నుంచి మంటలు మరియు పొగ రావడం గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు.. వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అపార్ట్‌మెంట్ కింద ఉన్న వాళ్లు చెప్పినట్లుగా 10 సంవత్సరాల బాలుడు.. తన తమ్ముడిని కిటికీ నుంచి కిందికి వదిలాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు బాలుడిని చాకచక్యంగా అందుకున్నారు. ఆ తర్వాత వారి సూచన మేరకు.. ఆ 10 ఏళ్ల బాలుడు కూడా కిటికీ నుంచి కిందికి దూకాడు. ఆ బాబుని కూడా వారు జాగ్రత్తగా పట్టుకున్నారు. దాంతో ఇద్దరు పిల్లలు ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే వీరిని అందుకునే క్రమంలో అథౌమాని వాలిద్ అనే 25 ఏళ్ల విద్యార్థి చెయి విరిగింది. వెంటనే అక్కడున్నవాళ్లు పిల్లలని, వాలిద్ ని సమీప ఆస్పత్రికి తరలించారు. వయసులో చిన్నవాడైనా తెలివిగా ఆలోచించి తనతో పాటు తన తమ్ముడి ప్రాణాలను కూడా కాపాడగలిగాడు ఆ 10 ఏళ్ల పెద్దబ్బాయి. వారు దాదాపు 40 అడుగుల నుంచి కిందికి దూకారు. ఆ వయసులో అంత ఎత్తు నుంచి దూకడమంటే మామూలు విషయం కాదు. ఈ ఘటనను అంతా పక్క అపార్ట్‌మెంట్ లో ఉండే వాళ్లు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వ్యూస్ రాబడుతోంది.

For More News..

కరెంట్ షాక్ తో తాత మనవరాలు మృతి..

తెలంగాణలో 20 రోజుల్లో 30 వేల కేసులు

చికెన్లో మత్తు కలిపి.. తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్