టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్: ఒకేసారి మూడు పనులు చేసే.. పెట్ బ్రష్‌‌‌‌‌‌‌‌

టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్: ఒకేసారి మూడు పనులు చేసే.. పెట్ బ్రష్‌‌‌‌‌‌‌‌

ఈ మల్టీఫంక్షనల్ పెట్‌‌‌‌‌‌‌‌ బ్రష్‌‌‌‌‌‌‌‌తో స్టీమ్ మిస్టింగ్, డీటాంగ్లింగ్, మసాజ్‌‌‌‌‌‌‌‌.. ఇలా ఒకేసారి మూడు పనులు చేయొచ్చు. ఇది కుక్కలు, పిల్లులకు బాగా సరిపోతుంది. దీన్ని టస్‌‌‌‌‌‌‌‌మ్యాడ్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. మృదువైన సిలికాన్ బ్రిస్టల్స్‌‌‌‌‌‌‌‌తో తయారుచేసిన ఈ దువ్వెన పెట్స్‌‌‌‌‌‌‌‌ చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది. 

ఈ బ్రష్‌‌‌‌‌‌‌‌ హ్యాండిల్‌‌‌‌‌‌‌‌ని 360 డిగ్రీల్లో ఎటువైపైనా తిప్పొచ్చు. పైగా ఇది చాలా తేలికైనది. పై భాగంలో ఉండే రంధ్రంలో నీళ్లు పోసి, బటన్ నొక్కితే బ్రష్‌‌‌‌‌‌‌‌ ముందుభాగంలో ఉండే మరో రంధ్రం నుంచి వెచ్చని ఆవిరి వస్తుంది. దాన్ని స్ప్రే చేయడం వల్ల మురికిగా, వదులుగా ఉండే బొచ్చు మృదువుగా మారుతుంది. 

నీళ్లతోపాటు కొన్ని చుక్కల షాంపూ కలిపి పెట్‌‌‌‌‌‌‌‌ బాత్‌‌‌‌‌‌‌‌కు ముందు స్ర్పే చేసుకోవచ్చు. ఇది షాంపూను సమానంగా స్ర్పే చేస్తుంది. దీనికి టైప్‌‌‌‌‌‌‌‌ సీ కేబుల్‌‌‌‌‌‌‌‌తో చార్జింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవచ్చు. రీచార్జబుల్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీతో వస్తుంది.