వాటర్ ​ఫ్రూఫ్ ​బ్యాగ్.. వర్షాకాలంలో ఎక్కువగా టూర్లకు వెళ్లేవాళ్లు ఇది కొనుక్కోండి..!

వాటర్ ​ఫ్రూఫ్ ​బ్యాగ్.. వర్షాకాలంలో ఎక్కువగా టూర్లకు వెళ్లేవాళ్లు ఇది కొనుక్కోండి..!

వర్షాకాలంలో ఎక్కువగా టూర్లకు వెళ్లేవాళ్లకు ఈ బ్యాగ్ చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా లగేజీ బ్యాగ్‌‌లు ఎక్కువగా ఉంటే కారు పైన వేసి తాడుతో కట్టేస్తుంటారు. కానీ.. వర్షం కురిస్తే అన్నీ తడిసి ముద్దవుతాయి. ఈ కార్గో బ్యాగ్ ఉంటే అలాంటి సమస్య తలెత్తదు. ఆటోమేజ్ అనే కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. దీన్ని కారు పైభాగంలో ఇన్​స్టాల్‌‌ చేసి, అందులో లగేజీ పెట్టుకోవచ్చు. ఇది వాటర్​ ఫ్రూఫ్తో రావడం వల్ల వర్షం కురిసినా లగేజీ తడవదు. పైగా దుమ్ము–ధూళి లాంటివి కూడా పడవు. దీన్ని ఇన్‌‌స్టాల్ చేయడం  కూడా సులభం.