క్రికెట్ బెట్టింగ్ కోసం అడ్డదారులు..ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్

క్రికెట్ బెట్టింగ్ కోసం అడ్డదారులు..ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్మెంట్  లెటర్స్
  • ఎమ్మెల్యే క్యాంప్​ క్లర్క్​పై విచారణ చేపట్టిన భద్రాచలం పోలీసులు 

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంప్​ క్లర్క్  కల్యాణ్​ క్రికెట్  బెట్టింగ్​ కోసం అడ్డదారులు తొక్కినట్లుగా తేలింది. శనివారం రాత్రి పోలీసులకు లొంగిపోయిన కల్యాణ్​ను విచారించారు. యాప్​ల ద్వారా అకౌంట్​ టు అకౌంట్​తో క్రికెట్  బెట్టింగ్ లో​పాల్గొన్నాడు. 

ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్​మెంట్  లెటర్స్  విషయంలో కూడా తీసుకున్న డబ్బులకు బ్యాంక్  అకౌంట్స్  ద్వారానే లావాదేవీలు నిర్వహించాడు. ఇలా రూ.5.30 కోట్ల వరకు లెక్క తేలింది. ఈ డబ్బంతా బెట్టింగుల్లో పోగొట్టుకున్నాడు. ఎమ్మెల్యే గన్​మెన్లు, క్యాంప్​ ఆఫీస్​కు వచ్చే పార్టీ లీడర్ల వద్ద కూడా రూ.లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. అలాగే అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని, డబ్బంతా బెట్టింగుల్లో పోగొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.