భగవంత్ కేసరి ట్రైలర్... బాలయ్య కోసం తలకాయ, బోటి కూర....

భగవంత్ కేసరి ట్రైలర్... బాలయ్య కోసం  తలకాయ, బోటి కూర....

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్‌ కేసరి.  కాజల్‌ హీరోయిన్ కాగా...  శ్రీలీల ముఖ్య పాత్ర చేస్తోంది. అయితే ఈ మూవీకి  సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను హన్మకొండలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామెడియన్ రచ్చ రవి  రచ్చ రచ్చ చేశాడు. 

బోటి కూర..తలకాయ కూర..

ఓరుగల్లుకు వచ్చిన బాలయ్య బాబు కోసం రచ్చ రవి ప్రత్యేక వంటకాన్ని వండుకొచ్చాడు. తలకాయ కూర..బోటి కూర వండి తెచ్చాడు. స్టేజ్ పై వచ్చిన రచ్చ రవి..బాలయ్య బాబు కోసం తలకాయ కూర, బోటి కూర వండుకొచ్చానని..టేస్ట్ చేయాల్సిందిగా బాలయ్య బాబును కోరాడు. 

రచ్చ రవి పిలుపుతో స్టేజ్ వెనకాల నిల్చున్న అతని తల్లి..ఓ సంచిలో తలకాయ కూర, బోటి కూర తీసుకొచ్చింది. ఆ సంచిని తీసుకున్న బాలయ్య బాబు..బరువు బాగుంది..టేస్ట్ ఇంకెంత అదురుతుందో అని మెచ్చుకున్నాడు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ముగిసిన తర్వాత రచ్చ రవి తెచ్చిన తలకాయ కూర, బోటి కూర టేస్ట్ చేశాడు. అబ్బా అద్బుతం అంటూ బాలయ్య కితాబిచ్చాడు.