OTTలో భగవంత్ కేసరి దూకుడు.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్

OTTలో భగవంత్ కేసరి దూకుడు.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్

నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణ కూతురిగా కనిపించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటించారు. షైన్ స్క్రీన్(Shine Screen) నిర్మాణ సంస్థపై సాహు గారపాటి(Shu Garipati) నిర్మించిన ఈ సినిమాకు  టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం దర్శకత్వం వహించారు. దసరా కనునకా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను బాక్సాఫిస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. 

బాలకృష్ణ సరికొత్త అవతారంలో కనిపించిన ఈ సినిమా మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది భగవంత్ కేసరి మూవీ. విడుదలైన కేవలం పదిరోజులోనే రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టి బాలకృష్ణ కెరీర్ మరో బంపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. 

ఇక ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చేసింది భగవంత్ కేసరి మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాకు ఆడియన్స్‌ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓటీటీలో కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలో ఈ మూవీకి దక్కుతున్న ఆదరణతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఈ  సినిమా దర్శకుడు అనిల్ రావిపూడికి నిర్మాత అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన టొయోటా​ వెళ్ళఫైర్ కారును బహుమతిగా అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.