Bhagyashri Borse: ఎవరీ భాగ్యశ్రీ బోర్సే?.. నాని, విజయ్, రవితేజ సినిమాలో ఛాన్స్

Bhagyashri Borse: ఎవరీ భాగ్యశ్రీ బోర్సే?.. నాని, విజయ్, రవితేజ సినిమాలో ఛాన్స్

విజయ్ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తోన్న మూవీలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ విజయ్ కి జోడిగా నటించడం దాదాపు ఖరారైంది.

తాజాగా ఈ అమ్మడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఇటీవల సుజీత్ డైరెక్షన్ లో తన 32వ సినిమాను మొదలుపెట్టేశాడు.ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్య శ్రీ బోర్సేని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కనుక బోర్సే ఫిక్స్ అయితే మాత్రం..ఈ అమ్మడు నక్క తోక తొక్కినట్లే అని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. 

గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా సంబందించిన అనౌన్స్మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’లో హీరోయిన్‍గా నటిస్తుంది.ఇప్పుడు ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ VD12 లో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.యారియాన్ 2లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన హరీష్ శంకర్ రవితేజ పక్కన మిస్టర్ బచ్చన్ లో మాస్ రాజాకి జోడిగా ఫిక్స్ చేశాడు. ఈ మూడు సినిమాలు కనుక హిట్ అయితే..మరో కొత్త బ్యూటీ టాలీవుడ్ ని ఏలే అవకాశం ఉంది.  

ఎవరీ భాగ్యశ్రీ బోర్సే..

పుణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే స్టార్ మోడల్‍గా ఫేమస్. క్యాట్బరీ సిల్క్ సహా కొన్ని యాడ్స్ చేశారు. ఈ అమ్మడు యారియాన్ 2 అనే బాలీవుడ్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది.అంతేకాదు..భాగ్యశ్రీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.