ఓటీటీకి వస్తున్న మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీకి వస్తున్న మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఒకప్పుడు ప్రేక్షకులకు ఎంటెర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని ఓటీటీలు రీప్లేస్ చేస్తున్నాయి. కేవలం సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్ లకు సైతం ఆడియన్స్ బాగా అడిక్ట్ అయ్యారు. అందులోనూ క్రైమ్, థ్రిల్లర్, హారర్ సిరీస్ లవైపు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు ప్రేక్షకులు. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు, సిరీస్ లు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. 

తాజాగా అలాంటి మరో ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీకి రానుంది. అదే బాలీవుడ్ మూవీ భక్షక్. భూమి పెడ్నేకర్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను పులకిత్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీను షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. దీంతో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లోకి కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుందట. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి థ్రిల్లర్ జానర్ సినిమాలంటే మీకు కూడా ఇష్టమైతే.. ఫిబ్రవరి 9 నుండి భక్షక్ చూసేయండి.