భరతవర్ష’ నుంచి ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్ డేల్ ఫిక్స్

భరతవర్ష’ నుంచి ‘అమ్మ కదిలి వచ్చె’  సాంగ్ రిలీజ్ డేల్ ఫిక్స్


గోపీచంద్ హీరోగా, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భరతవర్ష’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.  ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇటీవల ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయగా,  తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

దసరా  నవరాత్రుల వేళ   పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రానున్న  ‘అమ్మ కదిలి వచ్చె’ లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  అక్టోబర్ 14న మధ్యాహ్నం 3:52 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంటుంది. గుట్టలు, కొండల మధ్యలో నుంచి గోపీచంద్, రీతూ వర్మతోపాటు ఓ చిన్నారి అమ్మవారి విగ్రహాన్ని తలపై పెట్టుకుని వస్తున్న ఈ స్టిల్  సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆసక్తిని పెంచుతోంది.  అనుదీప్ దేవ్ ఈ పాటను కంపోజ్ చేశాడు. క్రీ.శ. 642 నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు.