ఐటీఐ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్..బీహెచ్ఈఎల్‌లో భారీగా పోస్టులు

ఐటీఐ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్..బీహెచ్ఈఎల్‌లో భారీగా పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది తయారీ యూనిట్ల పరిధిలో ఆర్టిజన్ గ్రేడ్–-IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 19 నుంచి ప్రారంభంకానున్నది.


పోస్ట్ పేరు: ఆర్టిజన్ గ్రేడ్-–4.
మొత్తం ఖాళీలు: 660.
ట్రేడ్ల వారీగా ఖాళీలు: ఫిట్టర్ 278, వెల్డర్ 104, టర్నర్ 52, మెషినిస్ట్ 101, ఎలక్ట్రీషియన్ 90, 
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 23, ఫౌండ్రీమాన్ 12.

యూనిట్ల వారీగా ఖాళీలు: బోయిలర్ ఆక్సిలరీస్ ప్లాంట్ (రాణిపేట్), తమిళనాడు  75, హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ ప్లాంట్ (విశాఖపట్నం), ఆంధ్రప్రదేశ్​120, ఎలక్ట్రానిక్స్ డివిజన్ (బెంగళూరు) 45, సోలార్ బిజినెస్ డివిజన్ (బెంగళూరు), కర్ణాటక 30, హెవీ ఎలక్ట్రిక్ ఎక్విప్​మెంట్ ప్లాంట్ (హరిద్వార్) ఉత్తరాఖండ్, 60, హెవీ పవర్ ఎక్విప్​మెంట్ ప్లాంట్ (హైదరాబాద్), తెలంగాణ 60, హెవీ ఎలక్ట్రిక్ ప్లాంట్ (భోపాల్), మధ్యప్రదేశ్ 60, ట్రాన్స్​ఫార్మర్ ప్లాంట్ (ఝాన్సీ), ఉత్తరప్రదేశ్ 60, హై ప్రెజర్ బాయిలర్ ప్లాంట్ (తిరుచిరాపల్లి) 150. 

విద్యార్హతలు

అభ్యర్థులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఎన్​టీసీ/ ఐటీఐ), నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (ఎన్ఏసీ) కలిగి ఉండాలి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఎన్​టీసీ/ ఐటీఐ, ఎన్ఏసీ రెండింటిలోనూ కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ  అభ్యర్థులు ఎన్​టీసీ/ ఐటీఐ, ఎన్ఏసీ రెండింటిలోనూ కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి.

అదనపు అర్హత: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఆయా ప్రాంతీయ భాషలపై ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయసు: 2026, అక్టోబర్ 1 నాటికి జనరల్/ ఈడబ్ల్యూఎస్​లకు 27 ఏళ్లు, ఓబీసీలకు 3‌‌0 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 32 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీడబ్ల్యూడీ, ఎక్స్– సర్వీస్​మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 19. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: డిసెంబర్.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్  www.bhel.comను సందర్శించండి.