కన్నుల పండువగా భీమన్న పండుగ

కన్నుల పండువగా భీమన్న పండుగ

నేరడిగొండ, వెలుగు: మండల కేంద్రంలో భీమన్న పండగను ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయమే గ్రామస్తులందరూ కలిసి డప్పు చప్పుళ్ల మధ్య పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా భీమన్న ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం  పూజలు నిర్వహించారు. పిల్లా పాపలను సల్లంగా చూడాలని, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.