Bhogi Movie First Single : శర్వానంద్ మాస్ జాతర మొదలైంది.. 'భోగి' నుండి ఫోక్ సాంగ్ 'ఎగిలి వారంగాలేసి' వచ్చేసింది!

Bhogi Movie First Single : శర్వానంద్ మాస్ జాతర మొదలైంది.. 'భోగి' నుండి ఫోక్ సాంగ్ 'ఎగిలి వారంగాలేసి' వచ్చేసింది!

వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand), ఈసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపేందుకు పక్కా మాస్ అవతారంలోకి దిగిపోయారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'భోగి' (Bhogi). ఇటీవల విడుదలైన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేయగా.. లేటెస్ట్ గా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఎగిలి వారంగాలేసి' (Egili Varanga) సాంగ్‌ను రిలీజ్ చేసి  ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు..

పల్లెటూరి స్వచ్ఛమైన జీవనశైలి, గ్రామీణ సంస్కృతి, వృత్తులు, పటేల వ్యవస్థ ప్రతిబింబించేలా సాగే ఈ జానపద గీతం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. పొద్దున్నే గ్రామంలో రోజు ఎలా మొదలవుతుంది? కష్టం వెనక ఉండే కుటుంబ అనుబంధాలు ఏంటి? అనే అంశాలను చూపిస్తూనే, పల్లెల్లో ఉండే రాచరికం, ఫ్యూడల్ వర్గాల ఆధిపత్యాన్ని కూడా ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు.

ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన అద్భుతమైన సాహిత్యం, మాస్ పల్స్ తెలిసిన భీమ్స్ సిసిరోలియో అందించిన ఫోక్ ట్యూన్ పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ తమ ఎనర్జిటిక్ గొంతులతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ మూవీలో శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ గ్రామీణ లుక్‌లో ఒదిగిపోగా, వారి కెమిస్ట్రీ కన్నుల పండుగగా ఉంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయాతి మరొక కథానాయికగా అలరించనుంది.

క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న శర్వానంద్.. 'భోగి'తో పక్కా మాస్ హీరోగా తన స్టామిటాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2026 నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.  మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి జాతర సృష్టించనుందో చూడాలి.