Bholaa Shankar : భోళా శంకర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్..ఎంతో తెలుసా?

Bholaa Shankar : భోళా శంకర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్..ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ (Bhola Shankar). స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కలెక్షన్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా భోళా శంకర్ ఈ రోజు(ఆగస్టు 11)న భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. ఏకంగా తెలుగు స్టేట్స్ లోనే 8 వందలకి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక  మన  తెలుగు స్టేట్స్ తో పాటుగా..కర్ణాటక లో కూడా భారీ స్క్రీన్స్ లో భోళా శంకర్ రిలీజ్ అయింది. 

దాదాపుగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 1500 థియేటర్స్ లలో రిలీజ్ అయినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ని రీచ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.ఇక భోళా మేకర్స్ అయితే రూ 80.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలని టార్గెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .ఇంత పెద్ద టార్గెట్ కష్టమే అయినా, చిరు స్టామినా వర్క్ అవుట్ అయితే మాత్రం రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయమే అంటున్నారు ట్రేడ్ నిపుణులు.  

భోళా శంకర్ మూవీ టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ.. ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందనేది హాట్ టాపిక్ మారింది. భోళా శంకర్ మూవీ వేదాళంకు రీమేక్ అవ్వడంతో..హిట్ అయితే కనుక మరో రీమేక్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ లవర్స్.

ఇక లేటెస్ట్ గా చిరు కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్ లో ఓ మూవీ చేయుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీకు బెజవాడ ప్రసన్న కుమార్  స్టోరీ అందిస్తున్నారు. ఇక చిరు బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తో కూడా మూవీ ఒకే చేశారని సమాచారం. హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా మెగాస్టార్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.