స్విట్జర్లాండ్‌‌లో ‘భోళా శంకర్’ సాంగ్ షూట్

స్విట్జర్లాండ్‌‌లో ‘భోళా శంకర్’ సాంగ్ షూట్

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్’. తమన్నా హీరోయిన్‌‌గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌‌లో సాంగ్ షూట్ జరుగుతోంది. ‘స్విట్జర్లాండ్‌‌లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్‌‌లో తమన్నాతో సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ  పాట ప్రేక్షకులతో
పాటు  అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం.

అప్పటివరకూ ఈ చిరు లీక్స్ పిక్స్’ అంటూ లొకేషన్ స్టిల్స్‌‌ని షేర్ చేశారు మెగాస్టార్. మహతి స్వర సాగర్ ఈ పాట కోసం రాకింగ్ నెంబర్‌‌‌‌ని స్కోర్ చేశాడు. మరోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. క్రియేటివ్ కమర్షియల్స్‌‌తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది.