రంగస్థలం లో రామ్ చరణ్ బాబు.. అదిరిపోయిన భోళా శంకర్ ట్రైలర్

రంగస్థలం లో రామ్ చరణ్ బాబు.. అదిరిపోయిన భోళా శంకర్ ట్రైలర్

మెగా స్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్. టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. తాజాగా భోళా శంకర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

అవుట్ అండ్ మాస్ కమర్షియల్ అంశాలలో వచ్చిన ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉంది. చిరంజీవి లుక్స్ అండ్ మ్యానరిజమ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి. నీ వెనక మాఫియా ఉంటే నా వెనుక దునియా ఉంది అంటూ చిరు చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇక ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా చాలానే ఉన్నాయి. తమన్నా చెప్పిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ బాబు లా నటిస్తున్నాడు రా అనే డైలాగ్ ట్రైలర్ కె హైలెట్ గా నిలిచింది.

ఇక మొత్తంగా మహేష్ రమేష్ గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, సుశాంత్ అక్కినేని, శ్రీముఖి, గెటప్ శ్రీను,హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమాతో అయినా మెహర్ రమేష్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.