Manoj-Mounika: బేబీ బంప్తో మౌనిక.. పిల్లా నువ్వంటే ప్రాణమే అంటున్న మనోజ్

Manoj-Mounika: బేబీ బంప్తో మౌనిక.. పిల్లా నువ్వంటే ప్రాణమే అంటున్న మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj)-భూమా మౌనికా(Bhuma Mounika) వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారగా.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఇక 2023 డిసెంబర్ లో తమ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు మనోజ్. తన భార్య భూమా మౌనిక రెడ్డి తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇక తాజాగా భూమా మౌనికా కూడా ఆసక్తికరమైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

బేబీ బంప్తో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు మౌనిక. అంతేకాదు భర్త మనోజ్ తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది.. క్యాప్షన్ ఇచ్చారు మౌనిక. ఇక భార్య చేసిన పోస్ట్ కి మనోజ్ స్పందిస్తూ.. పిల్లా ఓ పిల్లా.. నువ్వంటే నాకు ప్రాణమే.. అంటూ కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మనోజ్ వాట్ ది ఫిష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను వరుణ్ కోరుకొండ తెరకెక్కిస్తుండగా.. మెగా డాటర్ నిహారిక కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పెళ్లి తరువాత మనోజ్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.