కేవలం చెప్పు వదిలేస్తే ఇంత క్రేజా.. పుష్ప మూవీపై అమితాబ్ కామెంట్స్ వైరల్

కేవలం చెప్పు వదిలేస్తే ఇంత క్రేజా.. పుష్ప మూవీపై అమితాబ్ కామెంట్స్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu arjun ) హీరోగా వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో పుష్పరాజ్ గా ఆలు అర్జున్ నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాయి. మరీ ముఖ్యంగా శ్రీవల్లీ సాంగ్ అయితే టాప్ అని చెప్పాలి. గ్లోబల్ వైడ్ గా స్టార్స్ అందరూ ఆ పాటకు స్టెప్స్ వేశారు. 

అయితే తాజాగా పుష్ప సినిమాలోని శ్రీవల్లీ పాటపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత కొన్నేళ్లుగా అమితాబ్‌ కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ ప్రోగ్రామ్‌ హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షోకి సంబందించిన 15వ సీజన్‌ కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో పుష్ప సినిమాపై ఓ ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు అమితాబ్ సమాధానం ఇస్తూ.. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప మూవీ నిజంగా ఓ అద్భుతం, ఆ సినిమాలోని శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించింది. ఆ పాటల అల్లు అర్జున్ చెప్పును వదిలేసే స్టెప్ ఉంటుంది. కేవలం  చెప్పు వదిలేస్తే ఈ రేంజ్ లో వైరల్‌ అవడం అనేది నేను మొదటి సారి చూస్తున్నా.. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అమితాబ్. ప్రస్తుతం అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ పై  అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ కు ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.