బిగ్ బాస్ టైటిలా.. రవితేజతో సినిమానా? అమర్ షాకింగ్ డెసిషన్

బిగ్ బాస్ టైటిలా.. రవితేజతో సినిమానా? అమర్ షాకింగ్ డెసిషన్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) టైటిల్ విన్నర్ గురించే చర్చ నడుస్తోంది. ఈ సీజన్ ముందు నుండే ముగ్గురి మధ్యగట్టి పోటీ నడుస్తోంది. ఏడు కూడా చాలా తక్కువ తేడాతోనే. అందులో అమర్ దీప్(Amar deep), పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth), శివాజీ(Shivaji) ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ కానున్నారు అనేది ఇపుడు ఉత్కంఠగా మారింది. ఓటింగ్ లైన్స్ కూడా ముగిసిపోవడంతో.. ఫైనల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. 

ఇక తాజాగా ఆదివారం రోజు జరిగే ఫైనల్ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో చూస్తుంటే.. ఈ ఏడాది గ్రాండ్‌ ఫినాలేను మరింత గ్రాండ్‌ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీజన్‌లో పాల్గొన్న అందరూ కంటెస్టెంట్స్, స్టార్ గెస్ట్స్, సాంగ్ పర్ఫార్మెన్స్ ఇలా చాలానే ప్లాన్ చేశారు. అంతేకాదు.. మహేష్ బాబు, రవితేజ, కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, అల్లరి నరేశ్, రాజ్‌ తరుణ్‌, యాంకర్ సుమ, రోషన్ కనకాల, హీరోయిన్‌ మానస చౌదరి,  సందడి చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ ప్రోమో చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అమర్ దీప్ కు రవితేజ అంటే ఎంత పెద్ద ఫ్యాన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రోమోలో రవితేజ ఎంట్రీ తరువాత.. హోస్ట్ నాగార్జున అమర్‌దీప్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. బిగ్‌బాస్‌ గేట్స్ ఓపెన్ అయ్యాయి.. నువ్వు ఇపుడే బయటకి వస్తే రవితేజ తోపాటు ఆయన నెక్ట్స్‌ సినిమాలో నటిస్తావ్. అందుకోసం నీకు కేవలం 7 సెకన్లు మాత్రమే టైం ఉంది ఆలోచించుకో అన్నారు. నాగార్జున ఇచ్చిన ఆఫర్ కు మరో ఆలోచన లేకుండా..   గేట్ వైపు వేగంగా పరుగుత్తాడు అమర్ దీప్. మరి నిజంగానే అమర్ దీప్ బయటికొచ్చేశాడా? లేదా? అనేది తెలియాలంటే ఫినాలే ఎపిసోడ్ అయ్యేవరకు ఆగాల్సిందే.