
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్, నటి శుభశ్రీ రాయగురు పరిచయం అక్కర్లేని పేరు. మనోభావాలు పాప పేరుతో శుభశ్రీ బాగా పాపులర్ అయ్యింది. సమ్మోహనుడా అంటూ బిగ్ బాస్ స్టేజ్‌పై అందాలను ఆరబోసి స్టార్టింగ్ లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో కూడా ఫోటోషూట్లు, రీల్స్ షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
లేటెస్ట్గా శుభశ్రీ తన ప్రియుడు, ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్‌తో త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. శుక్రవారం (జూన్ 6న) వీరిద్దరి ఎంగేజ్‌మెంట్, మెహందీ, సంగీత్ వేడుకలు హైదరాబాద్‌లో గ్రాండ్గా జరిగాయి. అజయ్ మైసూర్-శుభశ్రీ కలిసి ఇటీవల మెసెస్టీ ఇన్ లవ్ అనే కవర్ సాంగ్ చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు.
శుభశ్రీ ఎంగేజ్‌మెంట్ ఈవెంట్లో నటుడు సాయి కుమార్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, హీరో సోహైల్తో పాటుగా పలువురు బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ హాజరై ఈ కొత్త జంటకు తమ బెస్ట్ విషెష్ అందించారు.
ఈ సందర్భంగా శుభశ్రీ తన పెళ్లి విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ ఫోటోలు షేర్ చేసింది. దీంతో నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాకుండా శుభశ్రీకి కాబోయే భర్త గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే, అతడి పేరు అజయ్ మైసూర్.. అలియాస్ AJ మైసూర్. ప్రస్తుతంఅజయ్ నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. వీరిద్దరి వివాహం జూలైలో ఆస్ట్రేలియాలో జరగనుంది.
నిర్మాత అజయ్ మైసూర్ సినిమాల విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాని 'అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్'పై నిర్మించాడు. గరుడవేగ అంజి 'టెన్త్ క్లాస్ డైరీస్' నటించారు. వీటితో పాటు పలు షార్ట్ ఫిలింస్, 50కి పైగా మ్యూజిక్ అల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు. శుభశ్రీ చివరగా నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంలో నటించింది.