బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ హంగామా మొదలైందంటే చాలు.. వివాదాలు, రచ్చ మామూలుగా ఉండవు. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా రాబోతున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' కోసం ఇప్పుడే బుల్లితెర ప్రియులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అంత కంటే ముందే 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. అయితే ఆడిషన్స్ చుట్టూ మాత్రం ఊహించనివివాదం రాజుకుంది.
అగ్ని పరీక్షలో అసంతృప్తి..
సామాన్యులు, సోషల్ మీడియా క్రియేటర్లకు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం కల్పించేందుకు 'అగ్నిపరీక్ష సీజన్ 2' నిర్వహించారు. తన వైవిధ్యమైన డ్యాన్స్ రీల్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ఇంఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు ఈ ఆడిషన్స్‌లో పాల్గొని రచ్చ లేపాడు. గ్రూప్ డిస్కషన్స్, రకరకాల రౌండ్లు దాటుకుంటూ ఫైనల్ రౌండ్ వరకు వెళ్లిన బాలు.. చివరి నిమిషంలో ఎలిమినేట్ అయ్యాడు. దీంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఆడిషన్స్‌కు పిలిచి అవమానిస్తా..
తన ఎలిమినేషన్ పై తీవ్ర మనస్తాపానికి గురైన ఉప్పల్ బాలు.. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో వదిలాడు. జడ్జిలు తనను ఘోరంగా అవమానించారని వాపోయాడు. ఫైనల్ రౌండ్‌లో ఏదో టాస్క్ ఇస్తారనుకుంటే.. నేను చేసే రీల్స్ జుగుప్సాకరంగా (Vulgar) ఉన్నాయంటూ నా కష్టాన్ని, నా బ్యాక్‌గ్రౌండ్‌ను నలుగురిలో హీనంగా మాట్లాడారు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎంతో కష్టపడి గుర్తింపు తెచ్చుకుంటే, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఎమోషనల్ అయ్యాడు
ఎన్నో కష్టాలు పడి ఫైనల్ వరకు వచ్చాను. నా టాలెంట్‌ను పరీక్షించాల్సింది పోయి అవమానించేలా మాట్లాడటం బాధ కలిగించింది. నేను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రీల్స్ చేస్తాను. అందులో తప్పేముంది?అంటూ బాలు ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ నేపథ్యం, చేస్తున్న పని గురించి కూడా ప్రతికూలంగా మాట్లాడారని బాలు పేర్కొన్నాడు. బిగ్ బాస్ అగ్నీపరీక్షకు పిలిచి అవమానిస్తారని అని మండిపడ్డారు.
నవదీప్‌పై సీరియస్..
అంతటితో ఆగకుండా, ఆడిషన్స్‌లో జడ్జిగా వ్యవహరించిన హీరో నవదీప్‌పై బాలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మీరు చేసే వీడియోల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? జడ్జి సీట్లో కూర్చున్నాం కదా అని మమ్మల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడటం ఏమాత్రం తగదు అని నేరుగా ప్రశ్నించాడు. నాకు జరిగిన ఈ అన్యాయానికి కచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది.. నాకు న్యాయం కావాలి అంటూ బాలు కన్నీటిపర్యంతమయ్యాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బాలు ఆవేదనను సమర్థిస్తూ షో నిర్వాహకులపై మండిపడుతుంటే.. మరికొందరు మాత్రం రియాలిటీ షోల ఆడిషన్స్ అంటేనే మైండ్ గేమ్‌లు, విమర్శలు సహజం అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, సెప్టెంబర్ 6న గ్రాండ్ ప్రిమియర్‌తో గ్రాండ్‌గా షురూ కానున్న బిగ్ బాస్ 10 హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
