దారుణంగా మోసపోయా.. బిగ్ బాస్ ఆరోహి వీడియో వైరల్

దారుణంగా మోసపోయా.. బిగ్ బాస్ ఆరోహి వీడియో వైరల్

ఆరోహి రావు(Arohi rao).. బిగ్ బాస్ సీజన్ 6(Bigg boss season6)లో పాల్గొని ఆడియన్స్ ను అలరించింది. అయితే ఈ అమ్మడు దారుణంగా మోసపోయిందట. అలా మీరు మోసపోకండి అని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అమ్మడు ఏ విషయంలో మోసపోయింది? ఎలా మోసపోయింది? ఆ వీడియోలో ఆరోహి ఎం చెప్పిందంటే. 

నాలుగు రోజుల క్రితం నాకు ఆర్డర్ డెలివరీ వచ్చింది. ఫ్లిప్ కార్ట్(Flip kart) లోనో, మీ షోలో(Meesho)నో ఆర్డర్ చేసుంటా అనుకోని.. ఆన్ లైన్ పేమెంట్ చేసి ఆ ఐటెం తీసుకున్నాను. ఎందుకైనా మంచిదని.. ఫోన్ చెక్ చేసుకోగా.. నేను ఏ ఆర్డర్ కూడా చేయలేదు. ఆర్డర్ చేయకుండానే డెలివరీ వచ్చింది. వెంటనే .. డెలివరీ బాయ్ కు కాల్ చేస్తే.. ఆ డెలివరీ మీషో నుండి వచ్చిందని చెప్పాడు. దాంతో మీషో హెల్ప్ సెంటర్‌కు కాల్ చేసి విషయం వివరించగా.. టికెట్ రైజ్ చేసాం.. 72 గంటల్లో మెయిల్ వస్తుందని చెప్పారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arohi Rao (@arohi_rao)

నాలుగు గడుస్తున్నా.. వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. నాకు వచ్చిన ఆర్డర్ లో కేవలం ఓ క్లాత్ ముక్క ఉంది. ఇది ఖచ్చితంగా మీషో యాప్ చేస్తున్న మోసం. మీకు కూడా ఎప్పుడైనా ఎలాంటి ఆర్డర్స్ వస్తే జాగ్రత్తగా పేమెంట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి.. అంటూ వీడియోలో వివరించారు ఆరోహి. దీనిపై చాలా మంది మాకు కూడా ఇలాగే జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.