బిగ్ బాస్ 19 హిందీతో పాపులర్ అయిన ఫర్హానా భట్ ఇప్పుడు 'ఖత్రోన్ కే ఖిలాడీ 15'లో తన సాహసంతో అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రమాదకరమైన స్టంట్స్‌తో మెప్పిస్తున్న ఆమె.. లేటెస్ట్ గా చేసిన ఓ టాస్క్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈసారి ఫర్హానాకు ఏకంగా బతికున్న పురుగులను తినే భయంకరమైన టాస్క్ ఎదురైంది.
ప్రోమోలో టాస్క్‌ను చూసిన వెంటనే ఫర్హానా భయంతో కేకలు వేస్తూ కనిపించింది. తన వల్ల కాదంటూ వెనక్కి తగ్గేందుకు ప్రయత్నించింది. పురుగులను నోట్లో వేసుకోవాలనే ఆలోచనే ఆమెను తీవ్రంగా భయపెట్టింది. అయితే కాసేపటి తర్వాత ధైర్యం కూడగట్టుకున్న ఫర్హానా.. భయాన్ని పక్కన పెట్టి టాస్క్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. చివరకు బతికున్న పురుగును తినేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె డెడికేషన్ చూసి తోటి కంటెస్టెంట్లు కూడా ఆశ్చర్యపోయినట్లు ప్రోమోలో కనిపిస్తోంది.
ఈ ఒక్క టాస్క్‌తో ఫర్హానా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. మొదట్లో ఆమెను బలమైన పోటీదారుగా చాలామంది భావించకపోయినా.. ఒక్కో స్టంట్‌లో భయాన్ని జయిస్తూ ముందుకు సాగడంతో ఇప్పుడు ఆమెను ఈ సీజన్ డార్క్ హార్స్గా అభిమానులు పిలుస్తున్నారు. బిగ్ బాస్ 19లో తన బోల్డ్, స్ట్రెయిట్‌ఫార్వర్డ్ యాటిట్యూడ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఫర్హానా.. 'ఖత్రోన్ కే ఖిలాడీ'లో మాత్రం తన మరో కోణాన్ని చూపిస్తోంది. ఈ సీజన్‌ను రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్నారు.
►ALSO READ | Jasmin Bhasin: కంటెస్టెంట్లను వణికిస్తున్న డేంజరస్ స్టంట్స్.. ఏకంగా జ్ఞాపకశక్తి కోల్పోయిన హీరోయిన్!
షో షూటింగ్ దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగింది. ఫర్హానా ఫైనల్ రేసులోనూ నిలిచినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఫైనలిస్టుల విషయంలో వేర్వేరు నివేదికలు రావడంతో అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి.. బతికున్న పురుగులను తినే సీన్‌తో ఫర్హానా చేసిన సాహసం ఇప్పుడు 'ఖత్రోన్ కే ఖిలాడీ 15'పై అంచనాలను మరింత పెంచింది. ఈ టాస్క్‌లో ఆమె పూర్తి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
TF is this promo...
— Rσɧίτ ➹ (@Nimma_Rohit) August 17, 2026
What are they feeding her in the name of task?#KKK15 #KhatronKeKhiladi15 #FarrhanaBhatt pic.twitter.com/Y9uqkCu1yC
