
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి టాప్ 5 వరకు వచ్చింది నటి ప్రియాంక జైన్(Priyanka Jain). తన ఆటతో జనల మనసులు గెలుచుకుంది. ఆటల్లో కూడా ఎక్కడ తగ్గకుండా టఫ్ ఫైట్ ఇచ్చింది. మగాళ్లతో సైతం ఈక్వల్ గా ఆది తన సత్తా చాటింది. కానీ, ఫైనల్ లో 5వ పొజిషన్ లో బయటకు వచ్చేసింది. అయినప్పటికి ప్రియాంకకు జనాల్లో మంచి ఫాలోయింగ్ పెరిగింది.
ఇదిలా ఉంటె తాజాగా ప్రియాంకకు సర్జరీ జరిగిందని తెలుస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. కానీ, కంగారు పడేంత సర్జరీ కాదని తన ప్రియుడు శివ్ తెలిపాడు... ప్రియాంక కి ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచి సైట్ ప్రాబ్లం ఉంది. అందుకే ఆమె ఎక్కువగా కళ్ళజోడుతోనే కనిపించేది. బిగ్ బాస్ కూడా అలాగే కనిపించింది. ఇక ఫంక్షన్స్, షూటింగ్ సమయంలో మాత్రం లెన్స్ వాడేది. అలా లెన్స్ పెట్టుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని.. శాశ్వత పరిష్కారంగా చిన్న సర్జరీ చేయుస్తున్నాం.. అంటూ శివ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.