Bigg Boss Season 20: 'బిగ్ బాస్ 20'లో షారుక్ ఖాన్ ఎంట్రీ..? సల్మాన్ ఖాన్ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియా షేక్!

Bigg Boss Season 20: 'బిగ్ బాస్ 20'లో షారుక్ ఖాన్ ఎంట్రీ..?  సల్మాన్ ఖాన్ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియా షేక్!

బిగ్‌బాస్ అంటేనే ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, ఊహించని డ్రామా. ఈ బుల్లితెర రియాల్టీ షోకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.  ఇప్పుడు 'బిగ్ బాస్ హిందీ సీజన్ 20'  సిద్ధమవుతోంది. లేటెస్ట్ రిలీజ్ చేసిన టీజర్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి సల్మాన్ ఖాన్ చెప్పిన ఒక్క డైలాగ్‌తో బాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా షారుక్ ఖాన్ బిగ్‌బాస్ స్టేజ్‌పై కనిపించబోతున్నాడా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

గుర్రంపై గ్రాండ్ ఎంట్రీ ..

మేకర్స్ విడుదల చేసిన టీజర్‌లో సల్మాన్ ఖాన్ ఓ అద్భుతమైన గుర్రంపై గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ కనిపించాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన'జో కరణ్ అర్జున్ మే హువా థా.. వో అబ్ బిగ్‌బాస్ మే హోగా... తథాస్తు!' అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సల్మాన్, షారుక్ కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ 'కరణ్ అర్జున్'ను గుర్తు చేసే ఈ డైలాగ్‌తో ఇద్దరు సూపర్‌స్టార్లు ఒకే వేదికపై కనిపించనున్నారా? అనే చర్చ మొదలైంది.

బిగ్‌బాస్ స్టేజ్‌పైకి షారుక్ ఖాన్ ?

ఇక సీజన్ గురించి మాట్లాడుతూ సల్మాన్ ఖాన్.. 'ప్రతి సీజన్‌లో కొత్త గేమ్, కొత్త ట్విస్టులు ఉంటాయి. కానీ ఈసారి మొత్తం సీజన్‌లోనే ఓ పెద్ద మిస్టరీ దాగి ఉంది. టీజర్‌లోనే క్లూ ఇచ్చాం. దాన్ని జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమవుతుంది' అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేశారు. దీంతో షారుక్ ఖాన్ బిగ్‌బాస్ స్టేజ్‌పై కనిపించబోతున్నాడా? అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక గత సీజన్ లాగా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 20వ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

కంటెస్టెంట్లు వీరేనా?

ఈసారి బిగ్‌బాస్ హౌస్ కూడా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనుందని సమాచారం. గత సీజన్లకు హౌస్ డిజైన్ చేసిన ఓమంగ్ కుమార్ స్థానంలో ఆర్ట్ డైరెక్టర్లు కాంచన్, రూపాలి ఈసారి సెట్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే.. మహీ విజ్, గీతా బస్రా, జన్నత్ జుబైర్, మిస్టర్ ఫైసు, నీయా శర్మ, పెర్ల్ వి పూరి, సునీల్ పాల్, షోవిక్ చక్రవర్తి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్‌బాస్ హిందీ సీజన్ 20' సెప్టెంబర్ 6 నుంచి కలర్స్ టీవీతో పాటు జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. మరి టీజర్‌లో సల్మాన్ ఇచ్చిన క్లూ నిజంగానే షారుక్ ఎంట్రీకే సంకేతమా? లేక మేకర్స్ మరో భారీ ట్విస్ట్ ప్లాన్ చేశారా? అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకు వేచి చూడాల్సిందే..