Bigg Boss Season 7: విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. మరి రన్నర్ ఎవరంటే?

Bigg Boss Season 7: విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. మరి రన్నర్ ఎవరంటే?

బిగ్‌బాస్ సీజన్ 7(Bigg boss Season7) తెలుగు రియాలిటీ షో చివరి దశకు చేరుకుంది. ఈవారంతో సి సీజన్ కు తెరపడనుంది. ఇక ఈ సీజన్ కు విన్నర్ ఎవరన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. నిజానికి గడిచిన సీజన్ లలో ఫ్యామిలీ వీక్ ముగిసేసరికి విన్నర్ ఎవరు అనే క్లారిటీ వచ్చేది కానీ.. ఈ సీజన్ లో మాత్రం ఎవరు విన్నర్ కానున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. గత వారం హౌస్ నుండి శోభా ఎలిమినేట్ అవగా.. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు మాత్రమే మిగిలారు. అందులో ప్రశాంత్, అమర్, శివాజీ, అర్జున్, యావర్, ప్రియాంక ఉన్నారు.

మరీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరు మాత్రమే బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ కానున్నారు. దీంతో పలు మీడియా సంస్థలు విన్నర్ ఎవరనేదానిపై సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి. అందులో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సంస్థ..  బిగ్ బాస్ తెలుగు 7కు సంబంధించిన సర్వే నిర్వహించారట. అందులో.. తాజాగా జరిగిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ లో గడిచిన రెండు వారల ఎపిసోడ్‌‌ల వరకు జరిపిన సర్వేలో శివాజీ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి సీజన్ 7 మొదలైనప్పటి నుండి ఆయన రేసులోనే ఉన్నారు. మైండ్ గేమ్స్ ఆడుతూ, తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ.. చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు. నటుడిగా ఆయనకున్న ఫేమ్ తోపాటు.. రైతు బిడ్డకు సపోర్ట్ గా ఉండటంతో మరింత క్రేజ్ వచ్చింది. దేంతో ఆయన మొదటిస్థానంలో నిలిచారు. ఇక రెండొవ స్థానంలో పల్లవి ప్రశాంత్ నిలువగా, మూడవస్థానంలో అమర్, ఆతరువాత ప్రియాంక, అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది.