బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ క్రేజీ షో.. ఇప్పుడు గ్రాండ్ గా సీజన్ 10 తో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ షో ఆగస్టు ఎండింగ్ లేదా సెప్టెంబర్ తొలి వారంతో ప్రారంభమయయే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచే అభిమానుల్లో భారీగా అసక్తి నెలకొంది.
'అగ్నిపరీక్ష సీజన్ 2' సిద్ధం..
గత సీజన్ 9 తరహాలోనే ఈ సారి కూడా సామాన్యులకు 'బిగ్ బాస్ ' హౌస్ లో పెద్ద పీట వేయబోతున్నారు. ఇప్పటికే 'అగ్ని పరీక్ష సీజన్ 2' పేరుతో డిజిటల్ ఆడిషన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున చెబుతూ.. 'ఈ సారి కసి పెరిగింది... కథ మారింది గెట్ రెడీ ఫర్ బిగ్ బిఫోరో బిగ్గెస్ట్' అంటూ ఈ షోపై అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లారు. ఈ సారి 'అగ్ని పరీక్ష సీజన్ 2' కు రెస్పాన్స్ భారీగానే ఉంది. దీంతో సారి పోటీ ఏం రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతోంది. గత సీజన్ 9 లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపిన కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచారు.
లీకైన కంటెస్టెంట్స్ లిస్ట్!
ఈ సీజన్ 10 కోసం బిగ్ బాస్ మేకర్స్ ఆల్రెడీ కొంతమంది పాపులర్ సెలబ్రిటీలను అప్రోచ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం. ఈసారి నిఖిల్ విజేయేంద్ర సింహా, తేజస్వీ గౌడ, పల్లవి రాంశెట్టి, పల్లవి గౌడ, హరి , వర్ష , దీపికతో పాటు 'కుక్ విత్ జాతి రత్నాలు' షోకు చెందిన పలువురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
నాగార్జున రెమ్యునరేషన్..
ఇక ప్రస్తుతం' బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ' హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్ 10 కోసం కింగ్ నాగార్జున ఏకంగా రూ. 40 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. గత సీజన్ 9కి ఆయన దాదాపు రూ. 35 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఈ సారి షోకు ఉన్న ప్రత్యేకత, క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మరో రూ. 5 కోట్లు అదనంగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఎప్పటిలాగే ఫ్యాన్స్ వార్స్, ఆర్మీలు, పెయిడ్ బ్యాచ్ ల హంగామాతో సోషల్ మీడియా హీట్ పెంచేందుకు 'బిగ్ బాస్ తెలుగు సీజన్10' మస్తాబవుతోంది. మరి ఈ సారి ఎలాంటి కాంట్రవర్సీలు , ట్విస్టులు ఉంటాయో చూడాలి..
