Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ వీకెండ్ ట్విస్ట్: అపూర్వ ఎలిమినేషన్‌తో కలకలం.. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడి!

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ వీకెండ్ ట్విస్ట్: అపూర్వ ఎలిమినేషన్‌తో కలకలం.. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడి!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 'దశావతారం'థీమ్‌తో 16 మంది సెలబ్రిటీలు, కామనర్స్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. అయితే లేటెస్ట్ గా హౌస్‌లో జరిగిన పరిణామాలు ప్రేక్షకులను షాక్‌కు గురిచేశాయి. వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిని నిలబెట్టి క్లాస్ పీకారు.

ఐదవ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా కెప్టెన్ వర్షిణి, ఇమ్యూనిటీ దక్కించుకున్న వంశీ, సుధీర్ మినహా మిగిలిన కంటెస్టెంట్లంతా నామినేషన్లలో నిలిచారు. 'రోడ్ టూ రీలోడ్' టాస్క్‌ల ద్వారా కొందరు సేవ్ కాగా.. చివరకు రోహిత్, షాలిని, అపూర్వ, చరణ్, నరేశ్ డేంజర్ జోన్‌లో మిగిలారు. ఓటింగ్ పరంగా రోహిత్ దూసుకెళ్తుండగా, చరణ్ లేదా షాలిని ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ, ఎవరికీ అందని విధంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అపూర్వ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

మూడు వారాల క్రితం మరో కంటెస్టెంట్ మిథిలేష్‌తో కలిసి అపూర్వ హౌస్‌లోకి అడుగుపెట్టింది. మిథిలేష్ రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ తీసుకుని వెళ్లిపోగా, అపూర్వ మాత్రం ఆటలో కొనసాగింది. అయితే రాగానే కెప్టెన్ అయినప్పటికీ, తన దూకుడు స్వభావం, విపరీతమైన అరుపులతో హౌస్‌మేట్స్‌తో విభేదాలు కొనితెచ్చుకుంది. నాగార్జున చేతిలోనూ చివాట్లు తిన్న ఈమెకు ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో ఓట్లు పడకపోవడంతోనే ఈ ఎగ్జిట్ ఖాయమైంది. 

మరోవైపు, హౌస్‌లో జోరు పెంచేందుకు మేకర్స్ మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను రంగంలోకి దింపుతున్నారు. వారిలో శివ కుమార్, సాక్షి నాయుడు, డాక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్, రామకృష్ణ ఉన్నారు. వీరు ఎంట్రీ ఇస్తే హౌస్ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.