తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే విడుదలైన తొలి టీజర్‌తో షోపై భారీ హైప్ నెలకొంది. మరోసారి అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టనున్న విషయం అధికారికంగా ఖరారవడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి 'గేమ్‌లో ఛాలెంజ్ కాదు.. గేమే ఒక ఛాలెంజ్' అనే ట్యాగ్‌లైన్‌తో సరికొత్త అనుభూతిని అందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
22 ఎపిసోడ్లుగా 'అగ్నిపరీక్ష సీజన్-2'?
ఇదిలా ఉంటే, మెయిన్ షోకు ముందు నిర్వహించే స్పిన్-ఆఫ్ రియాలిటీ షో 'అగ్నిపరీక్ష సీజన్-2' గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ప్రీ-షో ఆగస్టు 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని, గత సీజన్‌లో 15 ఎపిసోడ్లు ఉండగా ఈసారి దానిని 22 ఎపిసోడ్లుగా విస్తరించినట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి దశలో వేలాది అప్లికేషన్ల నుంచి ఎంపికైన కంటెస్టెంట్లను షార్ట్‌లిస్ట్ చేసి, తర్వాత ఫిజికల్, మెంటల్, స్ట్రాటజీ ఆధారిత టాస్క్‌ల ద్వారా అసలు బిగ్ బాస్ హౌస్‌కు అర్హులైన వారిని ఎంపిక చేసేలా ఫార్మాట్‌ను పూర్తిగా మార్చినట్లు సమాచారం. ప్రేక్షకుల ఓటింగ్‌తో పాటు జ్యూరీ మార్కులు కూడా కీలకంగా మారే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సెలబ్రిటీల లిస్ట్ ఇదేనా?
మరోవైపు ఈసారి 'దశావతారం' థీమ్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం ఆసక్తిని మరింత పెంచుతోంది. ప్రతి కంటెస్టెంట్‌లోని విభిన్న కోణాలను బయటకు తీసేలా టాస్క్‌లు, ట్విస్టులు, ఎలిమినేషన్ ప్రక్రియను డిజైన్ చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే గేమ్ మరింత కఠినంగా, అనూహ్య మలుపులతో సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు, ఈ సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీల జాబితాపై కూడా సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. నటి జ్యోతి, దీపికా రంగరాజు, ఉప్పల్ బాలు, కల్యాణ్, పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, పండు మాస్టర్, చంద్రహాస్ వంటి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరెవరు నిజంగా హౌస్‌లోకి అడుగుపెడతారో మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..
ప్రారంభం ఎప్పుడంటే?
ఇప్పటివరకు వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం' బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' షో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే 'అగ్నిపరీక్ష 2' ప్రసార తేదీ, కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్, 'దశావతారం' థీమ్ వంటి అంశాలపై స్టార్ మా లేదా షో నిర్వాహకుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లడంలో మేకర్స్ ఇప్పటికే సక్సెస్ అయ్యారు.
