'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ అయింది. మరి కొన్ని గంటల్లో బుల్లి తెరపై ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ సారి 'దశవతారం' కాస్టెప్ట్ తో వస్తున్న ఈ షోకు కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేయనున్నారు. అయితే అసలు హైప్ మాత్రం హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లపైనే ఉంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనే సెలబ్రిటీలు, కామనర్స్ ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంత నెలకొంది..
బిగ్ బాస్ హౌస్ లోకి 20 మంది..
లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. ఈ లీక్స్ ప్రకారం.. ఈసారి ఏకంగా 20 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ కళకళలాడబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు కాగా, మరో 10 మంది 'అగ్నిపరీక్ష' నుంచి ఎంపిక కానున్నారని టాక్ వినిపిస్తోంది. దశవతారం' థీమ్ తో ఈ సీజన్ వస్తుంది కాబట్టి సెలబ్రిటీల నుంచి 10 మంది 'అగ్నిపరీక్ష' నుంచి మరో పది మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ లిస్ట్ పై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. దీంతో నిజంగా ఎవరెవరు హౌస్‌లోకి వస్తారన్నది ఆదివారం వరకు సస్పెన్సే.
సెలబిట్రీ లిస్ట్ లిక్..
అయితే ఇప్పటివరకు వినిపిస్తున్న లీక్స్ సెలబ్రిటీ లిస్ట్‌లో సీరియల్ హీరోయిన్ దేబ్జానీ, సీరియల్ హీరో ముఖేష్ గౌడ, జబర్దస్త్ కమెడియన్స్ రామ్ ప్రసాద్, నరేష్, యాంకర్ వర్షిణి, సీరియల్ నటి చైత్రా రాయ్, 'వినాయకుడు' మూవీ ఫేమ్ కృష్ణుడు, సుధీర్ రెడ్డి, అదిత్ ఈశ్వరన్, టెంపర్ వంశీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
►ALSO READ | అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్‌లో ఒకదాని వెనుక ఒకటి 3 క్రేజీ సినిమాలు విడుదల
హౌస్ లోకి వెళ్లే సామాన్యులు విరే..
ఇక 'అగ్నిపరీక్ష 2' నుంచి ఎవరెవరు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 'అగ్నిపరీక్ష 2' లో 13 మంది మిగిలి ఉన్నారు. వారిలో ప్రస్తుతం వినిపిస్తున్న లీక్స్ ప్రకారం మిథిలేష్, చరణ్, రాజకుమారి, రోహిత్, ఝాన్సీ, అమన్, శ్రష్టి, షాలినీ, నవరసాల ఆర్కే, అపూర్వ, దీపక్ వంటి పేర్లు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్, చరణ్, రాజకుమారి దాదాపు కన్ఫామ్ అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంతే కాదు అగ్నిపరీక్షలో పాల్గొన్న వారితో కొందరు షో మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కూడా హౌస్ లోకి రానున్నారు.
సర్వం సిద్ధం..
ఇక 'బిగ్ బాస్ తెలుగు 10' గ్రాండ్ లాంచ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కంటెస్టెంట్ల ఏవీలు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు ఇప్పటికే షూట్ చేసినట్లు సమాచారం. టెంపర్ వంశీ డ్యాన్స్, కృష్ణుడు ఏవీ, దేబ్జానీ పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. నాగార్జున హోమ్ టూర్ షూట్ కూడా పూర్తయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే నిజంగా 20 మంది హౌస్‌లోకి వస్తారా? 'అగ్నిపరీక్ష' నుంచి ఎంతమంది ఛాన్స్ కొట్టేస్తారు? ఈ లీకులన్నీ నిజమవుతాయా? ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే సెప్టెంబర్ 6 వరకు వెయిట్ చేయాల్సిందే..
